RSS
email
Loading

State Bank of India Probessionery Officers (1717 Posts)


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేట్‌ బ్యాంక్స్‌ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ - 1717 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది 2010, జనవరి 31. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి.

ఈ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో 60 శాతం మార్కులు మరియు డిగ్రీలో 55 శాతం మార్కులు కనీస విద్యార్హతగా నిర్ణయించారు.



ఈ పోస్టుల భర్తీ ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వూల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష 2010 మార్చి 07న, జరుగుతుంది.
Apply Online Click me.

Notifications  --> Recruitments
మొదటి స్టేజ్‌ : రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ డిస్క్రెప్టివ్‌)
రెండవ స్టేజ్‌ : గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వూ
రాత పరీక్ష 3 గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షకు 2 గంటలు, డిస్క్రిప్టివ్‌ పరీక్షకు 1 గంట సమయం కేటాయించారు.

ఆబ్జెక్టివ్‌ పరీక్ష: ఆబ్జెక్టివ్‌ రాత పరీక్షలో
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (గ్రామర్‌, ఒకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌)
జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌
డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌
టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ (హై లెవల్‌) ఉంటాయి.

డిస్క్రిప్టివ్‌ పరీక్ష:ఆబ్జెక్టివ్‌ పరీక్ష అనంతరం డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ పేపర్‌కు 1 గంట సమయం కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ ప్రావీణ్యంపై టెస్టు ఉంటుంది. లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌, ప్రెస్సీ రైటింగ్‌ మొదలైనవి ఉంటాయి. చివరగా గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఉంటుంది. నిర్దేశింపబడిన అగ్రిగేట్‌ మార్కులు సాధించిన వారిని గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో 40 శాతం అగ్రిగేట్‌ మార్కులను కనీస మార్కులుగా నిర్ణయించారు. రెండు స్టేజ్‌ల మార్కుల ఆధారంగా తుది మెరిట్‌ జాబితాను నిర్ణయిస్తారు.
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ :
ఇంగ్లీషు విభాగంలో సాధారణంగా ఈ క్రింది అంశాలపై ప్రశ్నలుంటాయి.
1.Comprehension Test
2.Cloze Test
3.Synonyms Test
4.Antonyms Test
5.Idioms and Phrases Test
6.Fill in the blanks Test
7.Spelling Test
8. Correction of Sentences Test, etc.,

బ్యాంక్‌ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ పరీక్ష ఇంగ్లీషు విభాగానికి శ్రద్ధగా ప్రిపేర్‌ కావలసి ఉంటుంది. ఇంగ్లీషు పదజాలంలో మంచి పట్టు సంపాదించటానికి ప్రతిరోజు ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. పోటీపరీక్షలకు గత ప్రశ్నాపత్రాలను పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయడమంటే ఇచ్చిన సమాధానాలను చూడకుండా పరీక్షకు నిర్ణయించిన టైంలో సమాధానాలు గుర్తించి ఆ తరువాత మాత్రమే పుస్తకంలో ఇచ్చిన సమాధానాలను చూచి వచ్చిన మార్కులతో మన ప్రగతిని నిర్ణయించుకోవటం. ఇందువల్ల మనకు వచ్చినవి ఏమిటో రానివి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. రానివాటిని ఇంకోసారి రివిజన్‌ చేసుకోవచ్చు. బ్యాంక్‌ పి.ఓ. గత ప్రశ్నపత్రాలను కూడ ఈ విధంగా పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయండి. ఇందుకోసం మీకు బ్యాంక్‌ పి.ఓ. గైడ్సు, ప్రతియోగితాకిరణ్‌, కాంపిటీషన్‌ సక్సెస్‌ వంటి పత్రికలు ఎంతో ఉపకరిస్తాయి. కేవలం జుఔ్పుఈ లు సమాధానాలు గుర్తించి ఉన్న వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వివరణాత్మక సమాధానాలు ఉంటే సమాధానం ఎలా వచ్చిందని తెలుస్తుంది.

గత ప్రశ్న పత్రాలను ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే అంత స్పీడ్‌ వస్తుంది. ఇంగ్లీషు అయితే స్పీడ్‌తో పాటు భాష కూడ వస్తుంది. ఇంగ్లీషు విభాగంలో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు కేవలం కరెక్ట్‌ సమాధానాన్ని తెలుసు కోవటంతోనే సరిపుచ్చకుండా తెలియని మాటలకు ఇడియమ్స్‌కు అర్థాలను తెలుసుకొని గుర్తుంచుకోవాలి. కాంప్రెహెన్షన్‌ పాసేజెస్‌లో తెలియని మాటలకు అర్థాలను డిక్షనరీ సహాయంతో తెలుసుకొని గుర్తుంచుకోవాలి. వేరే నోట్‌బుక్‌పై నోట్‌ చేసుకోవాలి. దీనిని అప్పుడప్పుడు రివిజన్‌ చేస్తుండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా పెంపొందుతుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ : ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ టెస్ట్‌లో ప్రశ్నలు ఎక్కువగా కరెంట్‌ ఎఫైర్స్‌ మీద వస్తాయి. స్టాండర్డ్‌ జనరల్‌ నాలెడ్జి మీద ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి జనరల్‌ అవేర్‌నెస్‌లో మంచి మార్కులు సాధించాలంటే కరెంట్‌ ఎఫైర్స్‌లో మంచి పట్టు సాధించాలి. ఈ విభాగం కోసం అభ్యర్థులు వర్తమాన వ్యవహారాలపై బాగా సిద్ధమవ్వాలి. సమకాలీన అంశాలు అదీ ఎకానమీ, పాలిటీ ఆధారిత అంశాలపై అవగాహన అవసరం. దీనికోసం వార్తాపత్రికలతో పాటు 'బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌' లాంటి మ్యాగజైన్లు చదివితే ప్రిపరేషన్‌కు సహాయకారి అవుతుంది. జనరల్‌ అవేర్‌నెస్‌లో ఎక్కువ ప్రశ్నలు ఆర్థికాంశాలపైనే ఉంటాయి. వార్తాపత్రికలూ, మ్యాగజైన్లలోని వ్యాపార అంశాలపై ప్రత్యేక దృష్టితో సిద్ధమవ్వాలి. జనరల్‌ అవెర్‌నెస్‌ కోసం బాగా ప్రాచుర్యం పొందిన అంశాలపై సంక్షిప్తంగా నోట్సు రాసుకుంటూ ఎప్పటికప్పుడు తాజావి చేరుస్తుండాలి.
బ్యాంక్‌ పి.ఓ. పరీక్షలో కరెంట్‌ ఎఫైర్స్‌ మీద ప్రశ్నలు ప్రధానంగా ఈ క్రింది అంశాల మీద వస్తున్నాయి.
1.ప్రధానమైన జాతీయ సంఘటనలు
2.ప్రధానమైన అంతర్జాతీయ సంఘటనలు
3.వార్తల్లో వ్యక్తులు
4.వార్తల్లో ప్రదేశాలు
5.సభలు - సమావేశాలు - సదస్సులు
6.భారతీయ ఆర్థిక రంగం (కేంద్ర బడ్జెట్‌ - ప్రణాళికలు - వార్షిక సమీక్ష, రిజర్వ్‌బ్యాంక్‌ సమీక్షలు వగైరా)
7.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
8.నియామకాలు - రాజీనామాలు
9.అవార్డులు - బహుమతులు
10.వార్తల్లో గ్రంథాలు - గ్రంథకర్తలు
11.క్రీడారంగం
12.బ్యాంకింగ్‌, వాణిజ్యం తదితర అంశాలు
జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో ప్రశ్నలు ప్రధానంగా కరెంట్‌ ఎఫైర్స్‌ మీద ఉంటున్నాయి. కనుక కరెంట్‌ ఎఫైర్స్‌కు బాగా ప్రిపేర్‌ కావాలి. అంతమాత్రం చేత స్టాండర్డ్‌ జనరల్‌ నాలెడ్జికి అసలు ప్రిపేర్‌ కాకూడదని అర్థం కాదు. స్టాండర్డ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ మీద పట్టు ఉన్నప్పుడే కరెంట్‌ ఎఫైర్స్‌లో కూడా మంచి పరిజ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే కరెంట్‌ ఎఫైర్స్‌కు కావలసిన పూర్వరంగం లేదా నేపథ్యం స్టాండర్డ్‌ జనరల్‌ నాలెడ్జిలో ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులు ముందుగా స్టాండర్డ్‌ జనరల్‌ నాలెడ్జిలో మంచి పరిజ్ఞానం సంపాదించాలి. దానితోపాటే కరెంట్‌ ఎఫైర్స్‌కు రెగ్యులర్‌గా ప్రిపేర్‌ కావాలి.

కరెంట్‌ ఎఫైర్స్‌ కోసం ప్రతిరోజూ ఒక ఇంగ్లీషు పేపర్‌ చదవటం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు జనరల్‌ అవేర్‌నెస్‌కే కాకుండా జనరల్‌ ఇంగ్లీషుకు కూడా ఎంతో ఉపకరిస్తుంది. ఇంగ్లీషు పేపర్లలో ప్రధానంగా హిందూ,టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి పేపర్లు ఇందుకు ఎంతో ఉపకరిస్తాయి. ఇంగ్లీషు పేపర్లు కూడా ప్రస్తుతం చాలా చౌకధరలకు లభిస్తు న్నాయి. అందువల్ల వాటిని అవకాశం ఉంటే తెప్పించుకొని చదవటం మంచిది. వాటిని చదువుతూ పరీక్షకు అవసరమైన వార్తలను అంటే ప్రధాన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, అవార్డులు - బహుమతులు, వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రీడారంగం, ఆర్థిక రంగం, విద్యారంగం తదితర అంశాలకు సంబంధించిన వార్తలను కట్‌ చేసుకొని ఒక లాంగ్‌ నోట్‌బుక్‌ మీద అంటించుకోవాలి లేదా వాటి సారాంశాన్ని నోట్‌ పుస్తకం పై వ్రాసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేయటం వల్ల కరెంట్‌ ఎఫైర్స్‌లో మంచి పరిజ్ఞానం వస్తుంది.

ఇంగ్లీషు పేపరుతో పాటు 'కాంపిటీషన్‌ సక్సెస్‌ రివ్యూ', 'కాంపిటీషన్‌ మాస్టర్‌,' ప్రతియోగితా కిరణ్‌ వంటి పత్రికలలో కనీసం ఒకటి చదవటం మంచిది. ప్రతిరోజూ పేపరు చదివేందుకు అవకాశం లేని వారు కాంపిటీషన్‌ పత్రికలపై ఆధారపడవచ్చు. కరెంట్‌ ఎఫైర్స్‌కు సంబంధించినంత వరకు ఇది రెండో మార్గమైనా, అవకాశం లేనప్పుడు ఈ మార్గం తప్పదు. అంతేకాక ఇంగ్లీషు పేపరు చదవటం అవసరమైన విషయాలను నోట్‌ చేసుకోవటం, వంటి పనులు చేసే సమర్థత, అవకాశం, టైం లేనివాళ్ళు, కాంపిటీషన్‌ పత్రిక మీద ఆధారపడక తప్పదు. కాంపిటీషన్‌ పత్రికలను చదవటం వల్ల పేపర్లో మనం ఏఏ విషయాలు సేకరించాలి. ఎంతమేరకు సేకరించాలి, ఎలా వ్రాసుకోవాలి తదితర విషయాలు తెలుస్తాయి. కరెంట్‌ ఎఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జి ప్రిపరేషన్‌కు ఇయర్‌ బుక్స్‌ కూడా ఎంతో ఉపకరిస్తాయి.

కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇందుకోసం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ పుస్తకాలు చదివితే సరిపోతుంది. కంప్యూటర్‌ బేసిక్స్‌పై, ఇంటర్నెట్‌ పదజాలం ఎమ్‌.ఎస్‌. ఆఫీస్‌పై ప్రశ్నలు వస్తాయి. బ్యాంకులో పనిచేసే ఏ ఉద్యోగికైనా ఆ సంస్థ పట్ల సమగ్ర అవగాహన అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అది ఇతర బ్యాంకుల కంటే ఏ విధంగా మెరుగైనవి వంటి అంశాల పట్ల అవగాహన అవసరం. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బ్యాంకులు తమ విధి విధానాలను సరళీకరించడంతో పాటు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఆయా సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం సంస్థ ఉద్యోగులకు అవసరం. ఈ దృష్ట్యా ప్రత్యేకంగా మార్కెటింగ్‌ అంశాన్ని సిలబస్‌లో నిర్ధేశించారు. కామర్స్‌ నేపథ్యమున్న అభ్యర్థులు మార్కెటింగ్‌ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు చేయగలుగుతారు. మార్కెటింగ్‌ విషయంలో బాగా వాడుకలో ఉన్న కంపెనీల ట్యాగ్‌ లైన్‌ లాంటివీ, వినియోగదారుల స్వభావానికి సంబంధించిన పుస్తకాలూ ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.

వస్తువుల ఉత్పత్తి, మార్కెటింగ్‌, వినియోగ దారుల స్వభావాలు మొదలైన వాటిపై ప్రశ్నలుంటాయి. మార్కెటింగ్‌ పరిజ్ఞానం సంపాదించటానికి ముందుగా మార్కెటింగ్‌ మౌలికాంశాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే బ్యాంకుల వివిధ సేవల రూపాలు, వాటి ఉపయోగాలపై కూడా అవగాహన ఉండాలి. కాని బ్యాంకులో పనిచేసే ఏ ఉద్యోగికైనా ఆ సంస్థ పట్ల సమగ్ర అవగాహన అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అది ఇతర బ్యాంకుల కంటే ఏ విధంగా మెరుగైనవి వంటి అంశాల పట్ల అవగాహన అవసరం. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బ్యాంకులు తమ విధి విధానాలను సరళీకరించడంతో పాటు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఆయా సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం సంస్థ ఉద్యోగులకు అవసరం. ఈ దృష్ట్యా ప్రత్యేకంగా మార్కెటింగ్‌ అంశాన్ని సిలబస్‌లో నిర్ధేశించారు.

Bookmark and Share

0 comments:

Post a Comment