RSS
email
Loading

Civil Notification 2010

గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులు మన రాష్ట్రంలోనూ ఉన్నారు. వరుసగా రెండు పర్యాయాలు మొదటి ర్యాంకును మనరాష్ట్ర అభ్యర్థులు సాధించారు. గత ఏడాది జాతీయ స్థాయిలో సుమారు నాలుగు లక్షల మంది సివిల్స్‌కు పోటీపడ్డారు. ఈసారి రమారమి వెయ్యి పోస్టులు ఉన్నాయి. పోటీ అదే స్థాయిలో ఉంటుందని భావించవచ్చు.
యుపిఎస్‌సి నోటిఫికేషన్‌-2010
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2010 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత ప్రాథమిక పరీక్ష 2010 మే 23న నిర్వహిస్తారు. భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 965. అయితే ఆ సంఖ్య పెరగనూ వచ్చు లేదా తగ్గనూ వచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానంమేరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌ విభాగాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఉంటుంది.
అర్హతలు :
వయో పరిమితి : అభ్యర్థులు 2010 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలకు తక్కువ కాకుండా, 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ,ఎస్టీ,బిసీ ఇతర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు : ఏదేని గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
శారీరక ప్రమాణాలు : భారత ప్రభుత్వం సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2010 కోసం వెలువరించిన గెజిట్‌లోని అనుబంధం-3లో పేర్కొన్న విధంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎవరికెన్ని అవకాశాలు !
సివిల్స్‌ రాయాలని భావించే అభ్యర్థులకు ప్రభుత్వం కొన్ని పర్యాయాలు మాత్రమే రాసేందుకు అవకాశం కల్పిస్తుంది. వివిధ వర్గాలవారు ఈ విధంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకావచ్చు. జనరల్‌ అభ్యర్థులు-నాలుగుసార్లు, జనరల్‌ ఫిజికల్‌ హ్యాండ్‌క్యాప్డ్‌ అభ్యర్థులయితే ఏడు సార్లు రాయవచ్చు. అలాగే ఒబిసి అభ్యర్థులు ఏడుసార్లు హాజరుకావచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరిమితి లేదు.
దరఖాస్తు ఫారం : అభ్యర్థులు కమిషన్‌ నిర్దేశించిన ఫారం ద్వారానే దరఖాస్తులు పంపాలి. సంబంధిత దరఖాస్తు ఫారాలు కమిషన్‌ సూచించిన పోస్టాఫీసులు/హెడ్‌ పోస్టాఫీసుల్లో లభ్యం అవుతాయి. వాటిని 20 రూపాయలు చెల్లించి అభ్యర్థులు పొందవచ్చు. ఆయా పోస్టాఫీసుల్లో దరఖాస్తు ఫారాలు లభించిని పక్షంలో యూపిఎస్‌సి దరఖాస్తుల సరఫరా పర్యవేక్షణ విభాగాన్ని సంప్రతించవచ్చు. ఫోన్‌ నంబర్‌ : 011-23389366, ఫాక్స్‌ నంబర్‌ : 011-23387310.
ఫీజు : ఒబిసి అభ్యర్థులు సహా అందరూ 50 రూపాయల విలువైన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఫీ స్టాంప్‌లను దరఖాస్తుతోపాటు జత చేయాలి. ఎస్సీ,ఎస్టీ మహిళలు పిహెచ్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
చిరునామా : పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపించాలి.
సెక్రటరీ, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌,
ధోల్‌పూర్‌ హౌస్‌, షాజహాన్‌ రోడ్‌,
న్యూఢిల్లీ-110 069.
చివరితేదీ : పూర్తి చేసిన దరఖాస్తులు పైన పేర్కొన్న చిరునామాకు...వ్యక్తిగతంగా, పోస్టు/స్పీడ్‌ పోస్టు, కొరియర్‌ ద్వారా 2010 ఫిబ్రవరి 1లోపు చేరాలి.
సందేహాలు వస్తే : అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం విషయంలో సాయం/వివరణ/ సమాచారం/మార్గదర్శకం అవసరమైన పక్షంలో వ్యక్తిగతంగా యూపిఎస్‌సి క్యాంపస్‌లోని సి-గేట్‌ వద్ద ఉన్న ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని అన్ని పనిదినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రతించవచ్చు. ఫోన్‌ నంబర్లు : 011-23385271/23381125.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు 2010 జనవరి 2 నాటి ఎంప్లారుమెంట్‌ న్యూస్‌/రోజ్‌గార్‌ సమాచార్‌ సంచికను చూడవచ్చు.
వెబ్‌సైట్‌ :www.upsc.gov.in

Bookmark and Share

0 comments:

Post a Comment